ఏ భాషలోను లేని విధంగా, తొలి అక్షరాన్నే అమ్మగా మలచిన భాష తెలుగు. అమ్మ ప్రేమలోని మాధుర్యం తెలియకుండానే అనుభవిస్తాము. తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుసుకొని అనుభవిద్దాం.
తెలుగు తన మాతృ భాష కాకపోయినా తెలుగు భాష పై గల మక్కువతో “దేశ భాషలందు తెలుగు లెస్స” యని పలికాడు అలనాడు ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణ దేవరాయలు.
ఏ భాషలోను లేని ఒక రసవత్తరమైన ప్రక్రియ అవధానం, ముఖ్యంగా అష్టావధానం వంటి మనోరంజకమైన భాషా ప్రయోగ విశేషము తెలుగు భాషలో వుంది.
తెలుగు తేట. తేనెలూరుతుంది. తెలుగు మాట. తెలుగు భాషలోని పదాలు ఎక్కువగా అచ్చులతో అంతమవుతాయి. ఈ లక్షణ సామ్యత గల మరొక భాష ఐరోపా దేశానికి చెందిన ఇటాలియన్ భాష. అందువలన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ” అని అన్నారు.
ప్రవాసంలో వుంటూ, పాశ్చాత్య వాతావరణంలో పెరుగుతున్న మన పిల్లలకు మనదైన తెలుగును అందించి, ప్రోత్సహించే సంకల్పంతో నార్త్ కరోలినా, (అ.సం.రా.) లోని తెలుగు సాంస్కృతిక సంస్థ అయిన ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఈ దిశగా తలపెట్టిన చిన్ని ప్రయత్నం “టాటా తెలుగు బడి”. మా ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదించి, చేయూత నిస్తారని ఆశిస్తున్నాము.
ప్రవాసనివాసుల పిల్లలకు అమ్మవొడి మన టాటా తెలుగుబడి.
అయిదవ సంవత్సరంలోకి అడుగిడుతోంది టాటా తెలుగుబడి. అయిదు శిక్షణాస్థాయి తరగతులు – ప్రవేశం, ప్రవాళం, ప్రధానం, ప్రవర్ధం, ప్రావీణ్యం తో అమెరికాలో వుండే పిల్లలకు అవసరమైన విధంగా తెలుగు బోధన.
అఆలతో మొదలెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అచ్చ తెలుగులో మాట్లాడే టాటా తెలుగుబడి పిల్లలు
తెలుగు మాట – వెలుగు బాటా
టాటా తెలుగు బడి
www.triangletelugu.org
www.tatatelugubadi.blogspot.com
Enrollment for the next academic year (2024-25) is now open! Take advantage of our Early Bird Registration discount of $19, available until May 18th, 2024. Hurry and secure your spot: Enroll Now using below link:
https://tinyurl.com/TeluguBadiEnrollment24to25
(Early Bird Registration Discount: $19 until May 18th, 2024)
2024-25 Telugu Badi Class Schedule
For the detailed schedule of 2024-25 Telugu Badi classes, please visit the following link:
https://tinyurl.com/TeluguBadiClassSchedule2024-25
Please contact us if you have any questions at telugubadi@triangletelugu.org
Aruna Talluri
(Vice Principal)
Bala Garjala(Director)